పేద ప్రజల సంక్షేమం కోసమే మోదీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతూ ముందుకెళ్తోందని భారతీయ జనతాపార్టీ నాయకులు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. భాజపా ప్రచార రథంతో నాయకులు ఇంటింటా తిరుగుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ గ్రామాన భాజపాను బలోపేతం చేయడానికి పార్టీ శ్రేణులు శాయశక్తులా కృషి చేయాలని నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ వెంకట్ కార్యకర్తలకు సూచించారు.
ఇవీ చూడండి: అయోధ్య మధ్యవర్తిత్వం నివేదికపై నేడు సుప్రీం విచారణ