మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆందోళనకు దిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో భాజపా కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, రైతులు ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ధర్నా నిర్వహించారు.
అనంతరం బస్టాండ్ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు. మొక్కజొన్న రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మక్కలకు మద్దతు ధర ఇస్తూ.. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో భాజపా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరిన రైతులు