ETV Bharat / state

ఎంపీ అర్వింద్​పై దాడికి నిరసనగా భాజపా శ్రేణుల ఆందోళన - bjp protest at jagityala district

జగిత్యాల జిల్లాలో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఎంపీ అర్వింద్​పై దాడికి నిరసనగా ధర్నా చేపట్టారు. దీనితో జిల్లాలో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని.. భాజపా శ్రేణులను సముదాయించి.. ఆందోళన విరమించేలా చేశారు.​

bjp activists protest at jagityala district
ఎంపీ అర్వింద్​పై దాడికి నిరసనగా భాజపా శ్రేణుల ఆందోళన
author img

By

Published : Jul 13, 2020, 12:42 PM IST

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై దాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. ఆదివారం వరంగల్​లో భాజపా కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఎంపీ అర్వింద్​పై కొందరు దాడికి యత్నించారు. దీనికి నిరసనగా భాజపా నేతలు ఆందోళన చేశారు.

మెట్​పల్లిలోని పాత బస్టాండ్​ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై భాజపా నాయకుల ధర్నా నిర్వహించారు. రోజురోజుకి రాష్ట్రంలో భాజపా ఆదరణ పెరగడం వల్ల ఓర్వలేకనే తెరాస నాయకులు విచక్షణ కోల్పోతూ... దాడులకు పాల్పడుతున్నారని జిల్లా అధ్యక్షుడు భాస్కర్ ఆరోపించారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులకు పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

భాజపా నాయకులు ధర్నా చేయడం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని నాయకులను సముదాయించి ఆందోళన విరమించేలా చేశారు.

ఇదీ చూడండి:బంగాల్​ భాజపా ఎమ్మెల్యే ఆత్మహత్య?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.