కేంద్రం తెచ్చిన నూతన చట్టం.. కోట్పా నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బీడీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తెరాస కార్మిక విభాగం ఆధ్వర్యంలో.. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
నూతన చట్టం.. లక్షలాది మంది బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కోట్పా నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆజాద్‌కు వ్యతిరేకంగా జమ్ములో నిరసన