పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటలో సేవా భారతి ట్రస్ట్ నిర్వాహకులు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు జనపనార సంచులు పంపిణీ చేశారు.
చలిని తట్టుకునేందుకు వృద్ధులకు దుప్పట్లు పంచారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని సేవా భారతి వ్యవస్థాపకుడు రాజమల్లయ్య తెలిపారు. వంద మందికి పైగా వృద్ధులకు ఆసరాగా నిలిచామని వెల్లడించారు.