జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపులో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఇనిస్టిట్యూట్‌ను సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన ద్విచక్రవాహనాన్ని మంత్రి కొప్పుల నడిపారు. రోడ్డు ప్రమాదాలతో ఎంతో మంది చనిపోతున్నారని ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తే ప్రమాదాలు తగ్గుతాయని మంత్రి పేర్కొన్నారు.
ట్రాఫిక్‌పై అవగాహన కల్పించి, ప్రమాదాలను తగ్గించేందుకు జగిత్యాలలో ట్రాఫిక్ పాఠశాల ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సింధూశర్మ పేర్కొన్నారు. ఇందుకోసం సైన్ బోర్డు, నాలుగున్నర లక్షలతో ప్రత్యేక ద్విచక్రవాహనం, కంప్యూటర్ క్విజ్, డిజిటల్ తెరను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఆర్టీసీలోకి మరో 1035 అద్దె బస్సులు