జగిత్యాల జిల్లా ధర్మపురిలో నూలి పురుగులు నివారణ మాత్రలు వికటించి చిన్నారి సహస్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. జిల్లా వ్యాప్తంగా మరో 20 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. దీనికి నిరసనగా జగిత్యాలలో ఏవీబీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
వైద్యాధికారులను బాధ్యులను చేయాలని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించాలని డిమాండ్ చేశారు. గడువు తీరిన, నాసిరకం మాత్రలు పంపిణీ చేయటం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఈ నెల 24న భారత్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్