ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెరాసకు చెంపపెట్టని కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో ప్రజా సమస్యలకు సమయం ఇవ్వని సీఎం.. నేడు సోషల్ మీడియాలో ఫిర్యాదులకు స్పందించి కలెక్టర్లతో మాట్లాడి తాను బాగా పనిచేస్తున్నట్లు ఎన్నికల సమయంలో నిరూపించుకునే ప్రయత్నం చేశారని పొన్నం ఆరోపించారు. 16 ఎంపీ సీట్లనూ కాంగ్రెస్కు ఇస్తే కేసీఆర్ ఫాంహౌస్ వీడి సచివాలయం బాటపడతారన్నారు. వినోద్ కుమార్ ఏ పార్టీ నుంచి మంత్రి అవుతారో చెప్పాలని తెరాస నేతలను పొన్నం డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:నేడు రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రాక