ETV Bharat / state

అంజన్న చెంతన.. వానరాల ఆకలి తీర్చిన మహిళామూర్తి - వానరాల ఆకలి తీర్చిన మహిళ

లాక్​ డౌన్​లో మూగజీవులు సైతం తల్లడిల్లుతున్నాయి. ఆహారం కోసం దొరక్క అల్లాడుతున్నాయి. ఎవరన్నా మానవత్వం చూపితే కాస్తంత కడుపు నింపుకుంటున్నాయి. కొండగట్టు అంజన్న చెంతన వానరాలు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటి పరిస్థితిని చూసి చలించిపోయిన జగిత్యాలకు చెందిన పాము నీరజ అరటి పండ్లను అందించి ఆకలి తీర్చారు.

A woman who satisfies the hunger of monkeys
కొండగట్టులో వానరాలకు అరటిపండ్లు అందిస్తున్న మహిళ
author img

By

Published : Jun 6, 2021, 6:37 PM IST

లాక్‌డౌన్‌ ప్రభాలంతో కొండగట్టులో ఆంజనేయస్వామి చెంతన ఉండే వానరాలు ఆకలితో అలమటించడం చూసి ఓ మహిళ చలించిపోయింది. అరటి పండ్లు కొనుగోలు చేసి వాటి ఆకలి తీర్చింది. జగిత్యాలకు చెందిన పాము నీరజ కుటుంబం మానవత్వం చాటుకుంది. దీంతో వందలాది వానరాలు వచ్చి ఆకలి తీర్చుకున్నాయి. భక్తులెవరైనా వాటి ఆకలి తీర్చేందుకు ముందుకు రావాలని ఆమె కోరుతున్నారు.

సాధారణ సమయంలో ఆలయానికి వచ్చే భక్తులు వేసే ఆహారంతో వానరాలకు ఆకలి తీరేది. ప్రస్తుతం గత కొద్ది రోజులుగా ఆలయం మూసి వేయటం.. భక్తులు ఎవరు రాకపోవటంతో పస్తులుంటూ ఆకలితో అల్లాడుతున్నాయి. అప్పడప్పుడు కొందరు మానవత్వంతో పండ్లు కొనుగోళు చేసి వాటికి అందిస్తున్నారు.

ఇదీ చూడండి: Nagarjunasagar: సాగర్​ ఎడమ కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.