లైవ్ వీడియో: చూస్తుండగానే వాగులో కొట్టుకుపోయాడు... - live video
జగిత్యాల జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆనంతారం వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి వాగు పారుతోంది. నీటి ప్రవాహం ఉండగానే వాహనాలు ప్రయాణం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న స్థానికులు అతన్ని కాపాడారు. బాధితుడు జగిత్యాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదమంతా... బైక్ వెనకాలే వెళ్తున్న ప్రయాణికులు సరదాగా ఫోన్లో తీసుకున్న వీడియోలో నిక్షిప్తమయింది.
a man drown in anantharam river live video