Accident in jagtial district : జగిత్యాల జిల్లాలో పండగ పూట హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. గ్రానైట్ తీసుకు వెళ్తున్న లారీ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. దీనితో ఆ లారీలోని క్లీనర్ హరిందర్ సింగ్ అక్కడిక్కడే చనిపోయాడు. అదే వాహనం నడుపుతున్న డ్రైవర్ మాత్రం లారీలోనే చిక్కుకున్నాడు. బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆ డ్రైవర్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
A lorry driver was seriously injured in an accident : అసలేం జరిగిందంటే... గ్రానైట్ లోడుతో జగిత్యాల జిల్లా వైపు నుంచి.. నిజామాబాద్ జిల్లా వైపు వెళ్తోన్న లారీ అదుపుతప్పింది. ఇక మేడిపల్లి శివారులో చెట్టును ఢీకొట్టింది. క్లీనర్ అక్కడిక్కడే మృతి చెందగా... లారీ క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ మాత్రం ప్రాణాలతో ఉన్నాడు. లారీలో విలవిల్లాడుతున్న డ్రైవర్‌ను ఎలగైనా బయటకు తీసేందుకు స్థానికులు నానా ఇబ్బందులు పడ్డారు. లారీలోని క్యాబిన్‌లో ఇరుక్కుని బాధతో అల్లాడిపోయాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... అతని ప్రాణాలు కాపాడటానికి చివరకు కాలును తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లారీ క్యాబిన్ చెట్టు మధ్య ఢీకొన్న డ్రైవర్‌ను బయటకు తీయడానికి కాలు తొలగించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. కాలును తొలగించిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకురావడంతో.. ప్రాణపాయం తప్పిందని తెలిపారు. ఇక డ్రైవర్, క్లీనర్ ఇద్దరు కూడా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపడుతున్నారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి చర్యలు చేపడుతుంది. అయినా... అతివేగం, తాగి వాహనాలు నడపటం, అనాలోచితంగా డ్రైవింగ్ చేయడం వంటివి చేయడం వల్ల.. రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ట్రాఫిక్ పోలీసులు సైతం... వాహన దారులకు సూచనలు చేస్తున్నా... చాలా మంది పెడచెవిన పెట్టి.. డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. దాని వల్ల యాక్సిడెంట్లు సంభవిస్తూ ఉంటాయి. యాక్సిడెంట్ అంటే... ఓ వ్యక్తి చనిపోవడమో... గాయాలవ్వడమో కాదు... ఓ కుటుంబం రోడ్డున పడటం.. అని ఓ సినిమాలో హీరో ఈ డైలాగ్ చెప్తాడు. నిజమేనండీ.. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకుంటే... ప్రమాదాలను కొంచమైన అరికట్టవచ్చు.
ఇవీ చదవండి: