జగిత్యాల జిల్లాలో ఈ సారి ఎప్పుడూ లేనంతగా వరి పంటకు తెగుళ్లు సోకి పంట దిగుబడి తగ్గిపోయింది. దోమకాటుతో పంట చేతికి రాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని బీర్‌పూర్ మండలం తుంగూరుకు చెందిన మ్యాడ జనార్థన్ అనే రైతుకు చెందిన వరి పంటకు దోమకాటు సోకింది.
ఎండిపోయి చేతికి రాని పరిస్థితి ఏర్పడి కొంత పంటకు నిప్పుపెట్టాడు. నాలుగు ఎకరాల్లో సన్నరకాలను సాగు చేయగా దోమకాటు సోకిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎకరాకి కనీసం ఐదు క్వింటాళ్లు కూడా రాదని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు.
ఇదీ చూడండి: భార్య కాపురానికి రాలేదని యువకుడు ఆత్మహత్య