జగిత్యాల జిల్లా మల్లాపూర్లో విషాదం చోటుచేసుకుంది. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన అనుపురం సుజాత-లింగాగౌడ్ దంపతులకు ఇద్దరు కుమారులు. లింగాగౌడ్ సౌదీలో పనిచేస్తున్నాడు. సుజాత బీడీ కార్మికురాలు. ఈమె సోమవారం సాయంత్రం సపోటా పండ్లు కొని ఇంట్లో ఉంచింది.
రెండో కుమారుడు శివకుమార్(4) సపోటా తింటుండగా గొంతులో గింజ ఇరుక్కుంది. శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న బాలుడిని కుటుంబీకులు మెట్‌పల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శివకుమార్ కన్నుమూశాడు. బాలుడి మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చూడండి: తుపాకులు పట్టిన జవానుల చేతుల్లో చీపుర్లు