జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు రెండు వేల మందికి పైగా పాల్గొన్న ఈ ర్యాలీ జగిత్యాల జిమా మసీదు నుంచి టవర్ సర్కిల్, కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ముస్లింలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశఆరు. ఈ ప్రదర్శనలో పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. వెంటనే ఎన్ఆర్సీ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీ సందర్భంగా జగిత్యాల అదనపు ఎస్పీ దక్షిణామూర్తి భారీ బందోబస్తు నిర్వహించారు.
ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు