ETV Bharat / state

యువ కళావాహిని వ్యవస్థాపకులు నాగేశ్వరరావు కన్నుమూత - అక్కినేని నాటకోత్సవాలు

యువ కళావాహిని వ్యవస్థాపకులు.. వైకే నాగేశ్వరరావు గుండెపోటుతో కన్నుమూశారు. స్వామి వివేకానంద నాటకంలో.. 150 ప్రదర్శనలు పూర్తి చేసి రికార్డ్ సృష్టించిన వీరి అకాల మరణం.. సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

yuva kala vahini died
యువ కళావాహిని
author img

By

Published : Apr 14, 2021, 10:46 PM IST

యువ కళావాహిని వ్యవస్థాపకులు వైకే నాగేశ్వరరావు గుండెపోటుతో కన్నుమూశారు. మూడు రోజుల నుంచి.. దగ్గు, తీవ్ర జలుబుతో బాధ పడుతోన్న ఆయనను.. హఠాత్తుగా పల్స్ పడిపోవడంతో కూకట్​పల్లి, వివేకానందా నగర్​లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సహకార శాఖ ఉద్యోగస్థుడైన నాగేశ్వరరావు.. పదవీ విరమణ అనంతరం తన జీవితాన్ని పూర్తిగా సాంస్కృతిక రంగానికి అంకితం చేశారు. ఉద్యోగం చేస్తూనే.. నాలుగున్నర దశాబ్దాల క్రితం యువ కళావాహినిని స్థాపించారు. స్వామి వివేకానంద నాటకంలో ప్రధాన పాత్రను పోషించి.. అమెరికాతో పాటు దేశంలోని అనేక నగరాల్లో 150 ప్రదర్శనలు పూర్తి చేసి రికార్డ్ సృష్టించారు.

అక్కినేని నాటకోత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్న నాగేశ్వరావు.. గత మూడేళ్లుగా ప్రతి నెల జానపద కళాకారులకు నగదు పురస్కారాలు అందజేస్తున్నారు. అతని మరణం.. సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

ఇదీ చదవండి: ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలు సముద్రంలోకి విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.