ETV Bharat / state

అతని ఆలోచన.. చూపిస్తోంది ఎందరికో జీవిత గమ్యం - phani

సాధించలేమనుకున్నవాళ్లు సాకులు వెతికితే.. సాధించాలనుకునే వాళ్లు సాధనాలు అన్వేషిస్తారు అన్నచందంగా ఓ యువకుడు తన మనసులోని ఆలోచనతో ఎందరికో భవిష్యత్తునిచ్చాడు. చదువంటే కేవలం ఇంజినీరింగ్​, ఎంబీబీఎస్​ మాత్రమే కాదు సమాజాన్ని చక్కదిద్దే సివిల్​ సర్వీసుల్లో విద్యార్థులకు అవగాహన కల్పంచాలని తలంచాడు. స్నేహితులతో కలిసి యువజ్ఞాని సంస్థను స్థాపించి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాడు నిండా పాతికేళ్లులేని ఫణి​.

yuva-gnani-organization
author img

By

Published : May 16, 2019, 6:52 PM IST

యానిమేషన్​ నేర్చుకుని ఎంటర్​టైన్మెంట్​ రంగంలో రాణించాలన్నది ఆ యువకుడి కల. సరైన మార్గనిర్దేశకులు లేక ఏ కోర్సు ఎంచుకోవాలో తెలియక చివరికి ఇంజినీరింగ్​లో చేరాడు ఫణి. కాని మనసెప్పుడూ నచ్చిన రంగంలో లేననే బాధ వెంటాడుతూ ఉండేది. కాని తాను అనుకున్నది సాధించలేక పోయానని దిగులుపడుతూ కూర్చేలేదు ఆ యువకుడు. తనకు లభించని కెరీర్​ గైడెన్స్​ను నేటి తరానికి అందించాలని భావించాడు. తన స్నేహితుడు నిఖిల్​తో కలిసి యువజ్ఞాని పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు.

ఐఏఎస్​ కావాలని కలలుకంటున్న యువతీ యువకులకు తనవంతు సాయం చేయటంతో పాటు.. సివిల్​ సర్వెంట్లుగా ఏం సాధించవచ్చో విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నాడు. ఇగ్నైట్​ ఐఏఎస్​ అకాడమీతో కలిసి తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్​ టెస్ట్​లు నిర్వహిస్తూ .. ఉత్తీర్ణులైన వారిని సివిల్స్​కు ఎంపిక చేసే బాధ్యత నెత్తిన వేసుకున్నాడు.

ఉచిత శిక్షణ.. ఉపకారవేతనం అందిస్తూ

యువజ్ఞాని సంస్థ గత రెండు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 20కి పైగా ప్రాంతాల్లో టాలెంట్​ టెస్ట్​లు నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారికి ఇటీవలే హైదరాబాద్​లో గ్రాండ్​టెస్ట్​ నిర్వహించి దానిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ఐదేళ్ల పాటు ఉచిత ఐఏఎస్ శిక్షణ ఇప్పిస్తారు. తర్వాతి పది మందికి ఏటా రూ.50వేలు, ఆతర్వాతి 30 మందికి 30 చొప్పున ఉపకార వేతనం అందించనున్నారు.​

చదువుకోవాలనే ఆసక్తి ఉండి.. సరైన మార్గనిర్దేశకులు.. ఆర్థిక స్తోమతలేని తమలాంటి ఎందరో విద్యార్థులకు వెన్నదన్నుగా నిలిచిందంటున్నారు టాలెంట్​ టెస్ట్​ విజేతలు. తమ భవిష్యత్తు కోసమే తప్ప పక్కవారిగురించి ఆలోచించుకోని నేటి రోజుల్లో సమాజానికి ప్రతిభావంతులైన ఐఏఎస్​ అధికారులను అందించడానికి కృషిచేస్తున్నాడు ఫణి. నిండా పాతికేళ్లు నిండని ఇతని పటిష్ఠ సంకల్పం ఎందరికో ఆదర్శం.

అతని ఆలోచన.. చూపిస్తోంది ఎందరికో జీవిత గమ్యం

ఇదీ చదవండి: బోఫోర్స్ కేసు విచారణపై వెనక్కు తగ్గిన సీబీఐ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.