కొవిడ్ కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న గో సైనికులకు యుగతులసి ఫౌండేషన్ అండగా నిలిచింది. వారికి నెలరోజులకు సరిపడ నిత్యవసర సరకులను ఫౌండేషన్ సభ్యులు అందించారు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లోని శ్రీ త్రిశక్తి హనుమాన్ ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో యుగ తులసి ప్రతినిధులు యుతులు రాజ గోపాల్ నాయుడు, అంజనీ ప్రసాద్, చంద్రస్వామి, రవి కుమార్ తదితరులు ఆర్థిక సహాయాన్ని అందించారు.
నగరంలోని వివిధ గోశాలలో పనిచేసే గో సైనికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... ఈ విషయాన్ని గమనించి యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్ ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చూడండి: లాక్‌డౌన్‌తో ఉపాధి కరవాయె.. పిల్లలకు పట్టెడన్నం వరమాయె.!