ETV Bharat / state

రేపు గవర్నర్​తో భేటీ కానున్న షర్మిల.. ఆ అంశాలపై వినతిపత్రం అందజేత..! - షర్మిల పాదయాత్ర తాజా వార్తలు

YS Sharmila meets Governor Tomorrow: వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల రేపు రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​తో సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్​కు వినతి పత్రం అందించనున్నారు. అనంతరం వరంగల్​కు బయలుదేరి ప్రజా ప్రస్థాన పాదయాత్ర పునఃప్రారంభించనున్నారు.

YS Sharmila
YS Sharmila
author img

By

Published : Feb 1, 2023, 3:39 PM IST

YS Sharmila meets Governor Tomorrow: వైఎస్​ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​తో రేపు భేటీ కానున్నారు. రాజ్​భవన్​లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ని మధ్యాహ్నం 12 గంటలకు కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలన, వైఫల్యాలపై వినతి పత్రం ఇవ్వనున్నారు. గవర్నర్​ను కలిసిన అనంతరం రాజ్​భవన్ నుంచే వై.ఎస్.షర్మిల నేరుగా పాదయాత్రకు బయలుదేరుతారు.

గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వై.ఎస్.షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం అవుతుందని వైఎస్సార్టీపీ పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు. గతంలో ఆపేసిన ప్రాంతమైన వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజక వర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి వై.ఎస్.షర్మిల పాదయాత్ర మొదలుపెడతారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

YS Sharmila Praja Prasthana Padayatra: వైఎస్​ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర గురువారం నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. వరంగల్‌ పోలీసులు షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేసిన నేపథ్యంలో రేపటి నుంచి 18 వరకు యాత్ర కొనసాగనుంది. వ్యక్తిగత దూషణలు చేయరాదని, ఇతర పార్టీలు, కులాలు, మతాలను కించపరుస్తూ.. వ్యాఖ్యలు చేయరాదని పేర్కొంటూ 14 షరతలతో అనుమతిచ్చారు. గురువారం నుంచి 18 వరకు నిర్వహించుకోవడానికి అనుమతించారు. వరంగల్ జిల్లా శంకరమ్మ తండా నుంచి.. నెక్కొండ, పర్వతగరి, వర్ధన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట, ఘన్​పూర్, నర్మెట్ట, జనగామ, దేవరుప్పుల, పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం వరకూ యాత్ర చేసేందుకు వరంగల్ సీపీ అనుమతించారు.

బీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడులు.. పరస్పర ఘర్షణలు జరిగి ఉద్రిక్తతలకు దారి తీయడంతో.. షర్మిల ప్రజా ప్రస్ధానం పాదయాత్రను గత ఏడాది నవంబర్ 28న వరంగల్ జిల్లా శంకరమ్మ తండా వద్ద నిలిపివేశారు. షర్మిల ప్రయాణించే కారవాన్​పై పెట్రోల్‌ పోసి దాడి చేసి తగులబెట్టారు. చివరకు శాంతి భద్రతల విఘాతం కలుగుతోందంటూ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఆ మరునాడు 29న ధ్వంసం చేసిన వాహనాలతో హైదరాబాద్ ప్రగతి భవన్ వైపు షర్మిల వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో మరోసారి అలజడి రేగింది. వాహనం దిగేందుకు షర్మిల ససేమిరా అనడంతో.. ఆమెను కారుతో సహా పోలీసులు ఎస్సార్​నగర్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. షర్మిలతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. వ్యక్తిగత పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయద్దని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించద్దని పరతులు విధిస్తూ.. పాదయాత్రకు హైకోర్టు అనుమతించినా యాత్ర సాగలేదు. ఎట్టకేలకు రేపటి నుంచి షర్మిల ప్రజా ప్రస్ధాన యాత్ర చేసేందుకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.