ETV Bharat / state

ysrtp: పార్టీ పెట్టి నెల రోజులు కాలేదు.. అప్పుడే... - వైఎస్​ఆర్​టీపీలో పదవులు అమ్ముకున్నారని ఆరోపణలు

సరిగ్గా 22 రోజులక్రితం పురుడుపోసుకున్న వైఎస్ఆర్​టీపీలో అప్పుడే అంతర్గత కలహాలు మొదలయ్యాయి. పార్టీ కార్యాలయంలోనే నేతలు పదవులు అమ్ముకున్నారంటూ ఆపార్టీకి చెందిన కార్యకర్త నర్సింహారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మరికొంతమంది కార్యకర్తలు పార్టీ సోషల్ మీడియా గ్రూప్​లో మెసేజ్​లు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు.

ysrtp
ysrtp
author img

By

Published : Jul 30, 2021, 5:31 PM IST

వైఎస్ఆర్​టీపీలో పార్టీ పదవులు రూ.5 లక్షలకు అమ్ముకుని రాత్రికి రాత్రే పేర్లు మార్చేసారని దేవకద్రకు చెందిన ఆ పార్టీ కార్యకర్త నర్సింహారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పార్టీ అధినేత షర్మిలను వ్యతిరేకించడం లేదని.. పార్టీలో ఉన్న కోవర్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నానని స్పష్టంచేశారు. తాను ఎప్పటి నుండో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానన్నారు. ముక్కు మొహం తెలియని వారికి పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఎవరు ఎవరు సీట్లు అమ్ముకున్నారో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మరికొంతమంది పార్టీ కార్యకర్తలు పార్టీ సోషల్ మీడియా గ్రూప్​లో పార్టీలో చాలా మందికి అవమానాలు, అన్యాయాలు జరిగాయని మెసేజ్​లు పోస్ట్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్​లు నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి... పార్టీ కార్యాలయంలో ప్రెస్​మీట్ ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. వీరితో పాటు స్టీరింగ్ కమిటీ కూడా నియమించడం జరిగిందన్నారు. పని చేసే వారిని ఈ రెండు నెలలపాటు గుర్తించి భవిష్యత్​లో పెద్ద పెద్ద పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధిలుగా 11 మందిని, పార్లమెంట్ కన్వీనర్​లుగా 17 మందిని, కో కన్వీనర్​లుగా 108 మంది నియమించామన్నారు. ఈ సమావేశం అనంతరం కార్యాలయం ఆవరణలోనే వాగ్వాదం జరిగింది.

'వైఎస్​ఆర్​టీపీలో పదవులు అమ్ముకున్నారు'

వైఎస్​ఆర్​తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ జాబితా విడుదలైందో.. పార్లమెంట్​ కన్వీనర్​లుగా, కో కన్వీనర్​లుగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్​ మెంబర్లుగా, రాష్ట్ర కార్యదర్శులుగా ఈ పదవులన్నీ దాదాపు 50 శాతానికి పైగా కొత్త వ్యక్తులకు డబ్బులకు కార్పొరేట్​ వ్యవస్థలు అమ్ముకున్నాయి. తెలంగాణలో వైఎస్​ఆర్​ ఆసయాలు బతకాలంటే నిజమైనటువంటి రాజశేఖర్​రెడ్డి అభిమానులకే పదవులు కట్టబెట్టాలి. గతంలో వైఎస్​ఆర్​ కాంగ్రెస్​లో నేను రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను. రాష్ట్ర వార్డుమెంబర్ల సంఘం వర్కింగ్​ ప్రెసిడెంట్​గాను పనిచేశాను. కాని తెలంగాణకు వైఎస్​ షర్మిల రావాలని, షర్మిల ముఖ్యమంత్రి కావాలని పోరాటం చేసింది నేనొక్కడిని మాత్రమే. కానీ నాకే పదవి ఇవ్వలేదు. ఈ విధంగా నిజంగా పార్టీకోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వకుండా కార్పొరేట్​ సంస్థలు డబ్బులకు అమ్మకున్నారు. -నర్సింహారెడ్డి, వైఎస్​ఆర్​టీపీ కార్యకర్త.

ఇదీ చూడండి: Sharmila: పోడు భూములపై పోరాటానికి సిద్ధమైన వైఎస్​ షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.