నిరుద్యోగులు చనిపోతే కాని సీఎం కేసీఆర్ (Cm Kcr)కు కర్తవ్యం గుర్తుకు రాలేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ట్విట్టర్ వేదికగా అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటే కాని... కేసీఆర్ దొరకు ఉద్యోగాలు ఇవ్వాలనే సోయి రాలేదన్నారు. నిరుద్యోగులు చనిపోతూ ఉంటే చావకండి అని ఒక్క మాట చెప్పని కేసీఆర్... ఈరోజు జోనల్ సిస్టమ్ వల్లే ఆలస్యమైందని చెప్పడం ఆశ్చర్యం కల్గిస్తుందన్నారు.
ఈరోజు కేసీఆర్ దొర కళ్లు తెరిపించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టకముందే తాము నిరుద్యోగుల కోసం దీక్ష చేయడం వల్లే కేసీఆర్ సారు దిగొచ్చి ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని మాట్లాడుతున్నారన్నారు.
అయ్యా... కేసీఆర్ సారు 50వేల ఉద్యోగాలకు నోట్లో కాదు... వాటికి పూర్తిగా నోటిఫికేషన్స్ విడుదల చేసి భర్తీ చేయండి. 50 వేల ఉద్యోగాలే కాదు... ఖాళీగా ఉన్న లక్షా 90వేల ఉద్యోగాలను భర్తీ చేసేవరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని షర్మిల పేర్కొన్నారు. నిరుద్యోగులారా నిరుత్సాహపడకండి మీకోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిలబడుతుందని పోరాటం చేస్తుందని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
-
నిరుద్యోగులు చనిపోతే కానీ KCR గారికి కర్తవ్యం గుర్తుకు రాలేదు,
— YS Sharmila (@realyssharmila) July 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకొంటే కానీ .. KCR దొరకు ఉద్యోగాలు ఇవ్వాలనే సోయి రాలేదు,
నిరుద్యోగులు చనిపోతూ ఉంటే చావకండి అని ఒక్క మాట చెప్పని మీరు..
ఈ రోజు జోనల్ సిస్టమ్ వలనే లేటైందని చెప్పటం ఆశ్చర్యం ..
">నిరుద్యోగులు చనిపోతే కానీ KCR గారికి కర్తవ్యం గుర్తుకు రాలేదు,
— YS Sharmila (@realyssharmila) July 10, 2021
ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకొంటే కానీ .. KCR దొరకు ఉద్యోగాలు ఇవ్వాలనే సోయి రాలేదు,
నిరుద్యోగులు చనిపోతూ ఉంటే చావకండి అని ఒక్క మాట చెప్పని మీరు..
ఈ రోజు జోనల్ సిస్టమ్ వలనే లేటైందని చెప్పటం ఆశ్చర్యం ..నిరుద్యోగులు చనిపోతే కానీ KCR గారికి కర్తవ్యం గుర్తుకు రాలేదు,
— YS Sharmila (@realyssharmila) July 10, 2021
ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకొంటే కానీ .. KCR దొరకు ఉద్యోగాలు ఇవ్వాలనే సోయి రాలేదు,
నిరుద్యోగులు చనిపోతూ ఉంటే చావకండి అని ఒక్క మాట చెప్పని మీరు..
ఈ రోజు జోనల్ సిస్టమ్ వలనే లేటైందని చెప్పటం ఆశ్చర్యం ..
ఇదీ చూడండి: HARISH RAO: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ఆర్థికశాఖ కసరత్తు