కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని... జర్నలిస్టులను కరోనా వారియర్స్‌గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల అనుచరులు ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. కొవిడ్ రెండో దశ వేగంగా విస్తరిస్తోందని… ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక... ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేని నిరుపేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. అక్రిడేషన్లతో సంబంధం లేకుండా జర్నలిస్టులను కరోనా వారియర్స్‌గా గుర్తించాలని… కొవిడ్ టెస్ట్‌ల సంఖ్య పెంచాలని, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని కోరుతూ ధర్నా చేపట్టారు.