YS Sharmila Reacts on BRS Manifesto 2023 : కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోపై.. వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. బతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి.. మనిషి పోయాక భీమా ఇస్తారా..? అని విమర్శించారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో(BRS Manifesto 2023).. కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుందని ఆరోపించారు. పోయిన ఎన్నికలకు ఇచ్చిన హామీలనే నెరవేర్చే దిక్కు లేదు.. కానీ కేసీఆర్ మళ్లీ కొత్త కథ మొదలు పెట్టారని షర్మిల ఎక్స్‌లో మండిపడ్డారు.
-
కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుంది కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో. పోయిన ఎన్నికలకు ఇచ్చిన హామీలే నెరవేర్చే దిక్కు లేదు... మళ్లీ కొత్త కథ మొదలు పెట్టిండు.. బ్రతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి పోయాక భీమా ఇస్తాడట. సున్నా వడ్డీకే రుణాలు అని మోసం చేసిన దొర గారు ప్రతి మహిళకు…
— YS Sharmila (@realyssharmila) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుంది కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో. పోయిన ఎన్నికలకు ఇచ్చిన హామీలే నెరవేర్చే దిక్కు లేదు... మళ్లీ కొత్త కథ మొదలు పెట్టిండు.. బ్రతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి పోయాక భీమా ఇస్తాడట. సున్నా వడ్డీకే రుణాలు అని మోసం చేసిన దొర గారు ప్రతి మహిళకు…
— YS Sharmila (@realyssharmila) October 15, 2023కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుంది కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో. పోయిన ఎన్నికలకు ఇచ్చిన హామీలే నెరవేర్చే దిక్కు లేదు... మళ్లీ కొత్త కథ మొదలు పెట్టిండు.. బ్రతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి పోయాక భీమా ఇస్తాడట. సున్నా వడ్డీకే రుణాలు అని మోసం చేసిన దొర గారు ప్రతి మహిళకు…
— YS Sharmila (@realyssharmila) October 15, 2023
Telangana Assembly Elections 2023 : సున్నా వడ్డీకే రుణాలు అని మోసం చేసిన దొరగారు.. ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు ఇస్తామనడం హాస్యాస్పదం అన్నారు. నిరుద్యోగ భృతి అని గత మేనిఫెస్టోలో పెట్టిన పథకానికే దిక్కులేదు కానీ.. ఇప్పుడు రూ.3 వేలు ఇస్తామంటే నమ్మాలా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విడతల వారీగా పెన్షన్ల పెంపు ఒక పెద్ద జోక్ అని, రుణమాఫీపై కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వలేక ఏనాడో చేతులెత్తేశారన్నారు. ఉన్న పథకాలను పాతర పెట్టి.. ఓట్ల కోసం కొత్త పథకాలు అంటూ డ్రామాలు తప్ప మరోటి లేదన్నారు. బందిపోట్ల సమితి ఎన్నికల మేనిఫెస్టో ఓట్ల కోసమే తప్ప.. ప్రజల క్షేమం కాదని విమర్శించారు.
Revanth Reddy Comments on BRS Manifesto : కాంగ్రెస్ ప్రకటించిన హామీలనే కేసీఆర్ ఒక్కో వెయ్యి పెంచుతూ కాపీ కొట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సొంతంగా ఆలోచన చేసే శక్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోల్పోయారని ఎద్దేవా చేశారు. ఇతర ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టేందుకే కేసీఆర్ సమయం సరిపోతోందని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగానే కేసీఆర్ తన అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారని ఎద్దేవాచేశారు.
115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 51 మందికే బీ ఫారాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రకటించినవి అసాధ్యం అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మేనిఫెస్టోలో ఎలా పెట్టారని రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఒకప్పుడు కేసీఆర్ అడుగుల్లో ఇతర పార్టీలు నడుస్తాయని అనేవారని.. ఇప్పుడు ఆలోచనలు క్షీణించిన ఆయన.. కాంగ్రెస్‌ను అనుసరిస్తున్నారని ఆరోపించారు.
Kishan Reddy Comments on BRS Manifesto : బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో భాగంగా కేసీఆర్ మరో మేనిఫెస్టోను ప్రకటించారని విమర్శించారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్పితే.. ప్రగతి భవన్ దాటడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
KCR Speech in Praja Ashirvada Sabha Husnabad : 'ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలి'