తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. బంజారాహిల్స్ లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసంలో పలు విద్యార్థి సంఘాలతో షర్మిల భేటీ అయ్యారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు తీరు, తదితర అంశాలపై విద్యార్థుల అభిప్రాయాలను షర్మిల అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతలపై ముగిసిన విచారణ