ETV Bharat / state

TSPSC పేపర్ లీక్‌ పెద్ద స్కామ్.. ఇందులో వారి హస్తం ఉంది: వైఎస్‌ షర్మిల - YS Sharmila house arrested

YS Sharmila on TSPSC paper leak : వైఎస్‌ షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పేపర్‌ లికేజీకి నిరసనగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి షర్మిల పిలునివ్వడంతో... ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.

Sharmila
Sharmila
author img

By

Published : Mar 17, 2023, 1:15 PM IST

YS Sharmila on TSPSC paper leak :టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ వ్యవహారంపై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం మండిపడ్డారు. ఈ అంశంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్‌ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధ్వజమెత్తారు. పేపర్‌ లికేజీకి నిరసనగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి షర్మిల పిలునివ్వడంతో... ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు.

'' బంగారు తెలంగాణలో ప్రజా స్వామ్యం ఉందా లేదా.. కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఇది నియంత పాలన తలపిస్తోంది. ఒక్క ప్రతిపక్షానికి కూడా ఈరోజు గొంతు విప్పి మాట్లాడే అధికారం కూడా లేకుండా కేసీఆర్ గారు ఇంత కట్టడి ఎందుకు చేస్తున్నారు. భారత దేశ రాజ్యంగా తెలంగాణలో అమలు కావడం లేదు. ఎక్కడ కనిపించడం లేదు. తెలంగాణలో కనిపించేది ఒక్క కేసీఆర్ రాజ్యంగమే.'' - వైఎస్ షర్మిల, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు

TSPSC PAPER LEAK CASE UPDATES : టీఎస్‌పీఎస్సీది పెద్ద స్కామ్ అని షర్మిల ఆరోపించారు. ఇది అందరూ కుమ్ముక్కు అయి చేశారని అన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ సీబీఐతో దర్యాప్తు చేయించాలన్నారు. బోర్డు ఛైర్మన్ దగ్గర నుంచి.. మంత్రుల స్థాయిలో హస్తం ఉందని వెల్లడించారు. ప్రశ్నపత్రాలు కావాలనే లీక్ చేశారని తెలిపారు. బోర్డు మొత్తం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిట్‌తో దర్యాప్తు కరెక్ట్ కాదన్న షర్మి... సిట్ మీకు అనుకూలంగా విచారణ చేస్తోందని ఆరోపించారు. అందుకే సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లేకుంటే సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేయించాలని కోరారు.

YS Sharmila House Arrest : టీఎస్‌పీఎస్సీ నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం టీఎస్‌పీఎస్సీలో రిజిస్టర్ చేసుకున్నారన్నారని తెలిపారు. పేపర్ లీక్ అనేది ఓ పెద్ద స్కామన్నారు. బోర్డు ఛైర్మన్‌కు, సెక్రటరి తెలిసే వర్డ్‌లు బయటకు లీక్ ఎలా అయ్యాయని ఫైర్ అయ్యారు. మూడో వ్యక్తికి పాస్ వర్డ్‌లు ఎలా తెలిశాయని ప్రశ్నించారు.

'' అంగట్లో సరుకులు అమ్మినట్లు టీఎస్‌పీఎస్సీ పేపర్లు అమ్ముతున్నారు. ఒక్క ఏఈ పేపర్ కాదు... అన్ని పేపర్లు లీక్ అయి ఉంటాయి. గ్రూప్ 1 కూడా లీక్ అయి ఉంటుంది. రహస్యంగా ఉండాల్సిన సమాచారం బయటకు ఎలా వచ్చింది. ఇందులో అందరి హస్తం ఉంది. టీఎస్‌పీఎస్సీ సర్వర్ ఎలా లీక్ అవుతుంది. కవిత కేసుల మీద ఉన్న శ్రద్ధ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ మీద లేదు. ముఖ్యమంత్రి ఇంత వరకు ఎందుకు స్పందించడం లేదు. '' - వైఎస్ షర్మిల, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు

ఇక ఇదే కేసుపై కూడా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ లక్డీకపూల్‌ బీఎస్పీ కార్యాలయంలో ప్రవీణ్ కుమార్ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేయగా.. అనంతరం ఇంటికి తరలించారు. ఈ క్రమంలో ప్రవీణ్‌కుమార్‌ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు.

‘‘మీరు ఎన్ని అరెస్టులు చేసినా నా పోరాటం ఆగదని వెల్లడించారు. ఖబడ్దార్ కేసీఆర్... పేపర్ లీకులకు మీ కుటుంబానికి సంబంధం ఉందని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో ఉన్నది మీ ఏజెంట్లే అని అన్నారు. ఇది సీబీఐ దర్యాప్తు ద్వారానే తెలుస్తుందని వెల్లడించారు. నిజం నిప్పులాంటిది.... తెలంగాణ సమాజమంతా గమనించాలి’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక ఈ వ్యవహారంపై విపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళనకారులు రాకుండా ప్రత్యేకంగా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఎంజే మార్కెట్, బీజేపీ కార్యాలయం వద్ద పోలీసుల మోహరించారు. గాంధీ భవన్, నాంపల్లి సర్కిల్ వద్ద పోలీసుల మోహరించగా... టీఎస్‌పీఎస్సీ కార్యాలయం 2 గేట్లు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.