అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సులందరికీ వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. 'మీ ప్రాణాలను పణంగా పెట్టి.. మీ బంధాలను దూరం పెట్టి.. మీ బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న నర్సులందరికీ శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు.
కరోనాను ఎదురుకోవడంలో విరామమే లేకుండా.. ముందుండి పోరాడుతున్న ప్రతి నర్సుకి నర్స్ డే శుభాకాంక్షలు అని ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా పోరాటంలో మీరు చూపే ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానన్నారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్