YS Sharmila Got Indian Book Of Records : తెలంగాణలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించారని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలిపారు. వారు లోటస్ పాండ్‌లోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో షర్మిలను కలిసి అభినందించారు. అనంతరం అవార్డును ప్రదానం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఉద్దేశంతో షర్మిల ప్రజాప్రస్థాన(Praja Prastanam) యాత్ర పేరుతో పాదయాత్ర చేసింది.
One and Half Year Sharmila Padayatra in TS : 2021 అక్టోబర్ 21న ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన ప్రదేశం చేవెళ్ల నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో ఆమెకు ఎన్ని అడ్డకుంలు వచ్చిన వాటిని ఎదుర్కొని కొనసాగించారు. వరంగల్ జిల్లాలో ఎన్ని ఉద్రిక్తత పరిస్థితులు వచ్చిన కోర్టుకు వెళ్లి మరీ.. అనుమతులు తెచ్చుకొని పాదయాత్ర కొనసాగించారు. దాదాపు సంవత్సరం ఆరు నెలలు ఈ యాత్ర కొనసాగింది.
YS Sharmila Praja Prastanam Details in Telangana : ప్రజాప్రస్థాన పాదయాత్రలో ఆమె బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కొన్ని చోట్ల ఆమె యాత్రకు పోలీసులు ఆటంకం కలిగించారు. మరికొన్ని సార్లు జైలుకి కూడా వెళ్లారు. అయినా ఆమె పట్టు వదలని విక్రమార్కునిలా పాదయాత్రను కొనసాగించింది. ఇటీవలే వైఎస్సాఆర్ పుట్టిన రోజు సందర్భంగా పాలమూరులో మరల తన పాదయాత్రను త్వరలో మొదలు పెడతానని ప్రకటించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పాదయాత్ర చేసినా.. తెలంగాణలో చేసినంత సుదీర్ఘంగా చేయలేదు.
YS Sharmila Tweet on KCR : కేసీఆర్‌కు షర్మిల సవాల్.. దమ్ముంటే సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వండి..
Sharmila Paticipate 77TH Independence Day Celebrations : హైదరాబాద్‌లోని వైఎస్‌ఆర్‌టీపీ కార్యాలయంలోని 77వ స్వాతంత్ర్య దినోత్సవ(Independence Day) వేడుకల్లో వైఎస్ షర్మిల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం గొప్పదనమని అన్నారు. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు కలిసిమెలిసి జీవిస్తుండడం దేశ గౌరవం అని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బ్రిటీష్ వారు ఆచరించిన డివైడ్ అండ్ రూల్ పద్దతిలో పాలన సాగుతుందని విమర్శించారు. మణిపూర్‌లో మహిళలపైన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాదితో కేసీఆర్ పాలన అంతం కావాలని షర్మిల ఆకాంక్షించారు.
YSRTP Merge in Congress : కాంగ్రెస్‌లో.. వైఎస్‌ఆర్‌టీపీ విలీనం కానుందా?
YS Sharmila Padayatra Update : 'అతి త్వరలోనే ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభం'
YSR 74th birth anniversary ఇడుపులపాయలో వైఎస్ఆర్ 74వ జయంతి వేడుకలు.. హజరైన షర్మిల, విజయమ్మ.!