ETV Bharat / state

Sharmila fires on KCR and KTR : 'మహారాష్ట్రలో తిరుగుతున్న BRS​ నేతల ఖర్చులను తెలంగాణ ఖాతాలో జమచేస్తారా!' - కేసీఆర్​ మహారాష్ట్ర పర్యటన ​ షర్మిల కామెంట్స్​

YS Sharmila allegations against CM KCR : 'ప్రజల రక్తాన్ని, కష్టాన్ని ఎంతలా పీక్కుతినాలో' సీఎం కేసీఆర్ ఆయన అనుచరుల నుంచి నేర్చుకోవాలని వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్​ షర్మిల అన్నారు. మహారాష్ట్రలో తిరుగుతున్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు.. ఆ ఖర్చులను తెలంగాణ ఖాతాలో జమచేస్తారా..! అని ప్రశ్నించారు. ట్విటర్​ వేదికగా సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​పై ఘాటు విమర్శలు చేసిన ఆమె.. తన రాజకీయ ఎదుగుదలను చూసి కేటీఆర్​కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

YS Sharmila
YS Sharmila
author img

By

Published : Jun 26, 2023, 8:49 PM IST

YS Sharmila comments on CM KCR Maharashtra tour : ట్విటర్​ వేదికగా వైటీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్​పై ఘాటు విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ తిరిగే టీఎస్​ఆర్టీసీ బస్సు మొదలుకొని మంత్రులు, ఎమ్యెల్యేలు తెలంగాణ వాహనాలతో మహారాష్ట్రలో ఎలా తిరుగుతారని ఆమె ప్రశ్నించారు. మహారాష్ట్రలో మంత్రులు తిరిగే వాహనాలు తెలంగాణ ఆస్తులని.. రాష్ట్ర ప్రజల కష్టార్జితమని గుర్తు చేశారు.

ప్రజల పన్నుల మీద కొనుగోలు చేసే వాహనాలను ఏ నైతికతతో ఆ రాష్ట్రంలో నడుపుతారని మండిపడ్డారు. ఈ తొమ్మిదేళ్లలో రూ.5లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా తెలంగాణను మార్చారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షన్నర కోట్ల కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఇసుక, గనులు, గ్రానైటు, భూములు అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. బీఆర్​ఎస్​ నేతలను బందిపోటు రాక్షస సమితి నేతలుగా వైఎస్​ షర్మిల పోల్చారు. చివరికి ప్రభుత్వ పథకాల్లోనూ కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.

  • మందిసొమ్ము ముప్పొద్దులా మెక్కే ముదనష్ఠపు స్వభావం ఎవరికైనా ఉంది అంటే, అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అయన అవినీతి చెంచాలు అని చెప్పుకోవాలి. అసలు ప్రజల రక్తాన్ని, కష్టాన్ని ఎంతగా పీక్కుతినాలో వీరి నుండి నేర్చుకోవాలి. సీఎం గారు, మీ దిక్కుమాలిన దేశ రాజకీయాల కోసం తెలంగాణ డబ్బును ఎంత…

    — YS Sharmila (@realyssharmila) June 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

YS Sharmila latest comments : ఇప్పుడు బీఆర్​ఎస్​ నేతల గొప్పల కోసం రాష్ట్ర ఆస్తులను పక్క రాష్ట్రంలో వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీఆర్​ఎస్​ నేతలకు నీతి ఉంటే తెలంగాణ వాహనాలను సరిహద్దులో వదిలి.. మహారాష్ట్ర వాహనాలల్లో తిరగాలని హితవు పలికారు. కేసీఆర్​ రాజకీయాలను మహారాష్ట్ర ప్రజలు నిరాకరించారని అభిప్రాయపడ్డారు. బీఆర్​ఎస్​ ఆటలు కట్టించడానికి ప్రజలు ఓటుతో సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు.

YS Sharmila fires on KTR : తన రాజకీయ ఎదుగుదలను చూసి కేటీఆర్​కు భయం పట్టుకుందని షర్మిల అన్నారు. తండ్రి పేరు చెప్పుకొని పదవులు అనుభవించేది కేటీఆర్​ అయితే.. తండ్రి చూపెట్టిన సంక్షేమ పాలన కోసం ఒంటరి పోరు చేస్తోంది తానని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం 3,800 కి.మీ పాదయాత్ర చేశానని గుర్తు చేసుకున్నారు. సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ స్థానిక ఎమ్మెల్యేల అవినీతిపై మాట్లాడానని పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం అంతులేని పోరాటం చేశానని తెలిపారు.

ఎన్నో ప్రజా ఉద్యమాలు తెలంగాణ ప్రజల కోసం చేశానని గుర్తు చేసుకున్నారు. మరి ప్రజల కోసం కేటీఆర్​ ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఇన్ని రోజులు ప్రజలకు మంచి పాలన అందించని బీఆర్​ఎస్​ నేతలు.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజల ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసి ఆత్మగౌరవాన్ని చంపింది బీఆర్​ఎస్​ అయితే.. పార్టీ పేరులోనే తెలంగాణను పెట్టుకొని ఆత్మగౌరవంతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అని స్పష్టం చేశారు.

  • షర్మిల రెడ్డి రాజకీయ ఎదుగుదలను చూసి కేటీఆర్ కు భయం పట్టుకుంది.తండ్రి పేరు చెప్పుకొని పదవులు అనుభవించేది నువ్వైతే..తండ్రి చూపెట్టిన సంక్షేమ పాలన కోసం ఒంటరి పోరు చేసేది నేను.తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం 3,800 కి.మీ పాదయాత్ర చేసింది వైయస్ షర్మిల రెడ్డి. సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ…

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.