హైదరాబాద్‌లో పాత సచివాలయాన్ని కరోనా హాస్పిటల్‌గా మార్చాలంటూ... యువజన కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి ఫిరోజ్ ఖాన్‌తో పాటు మరో 20మంది కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పాత సచివాలయాన్ని కూల్చివేయవేయకుండా కరోనా ఆస్పత్రిగా మార్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు కార్యకర్తలందరినీ... రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చూడండి: కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడి