Young Woman Suicide After Her Lover Death : ఆమె ఒంటరి జీవితంలోకి వచ్చి వసంతాన్ని కురిపించాడు ఆ యువకుడు. పరిచయం కాస్త పెరిగి ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి జీవితాంతం కలిసి ఉందామనుకున్నారు. కానీ అంతలోనే విషాదం. వారి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో రెండు రోజుల క్రితం ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని గాఢంగా ప్రేమించిన ఆ యువతి ప్రియుడిని మరువలేకపోయింది. ప్రియుడి ఎడబాటు తట్టుకోలేకపోయింది. ఒక్కతే మానసికంగా కుంగిపోయింది. తన బాధను పంచుకోవడానికి తోడు లేకపోవడంతో విపరీతమైన ఒత్తిడికి గురైంది. దీంతో ఓ షాకింగ్ నిర్ణయం తీసుకంది. 'నీవు లేని లోకంలో జీవించలేను' అంటూ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నేహా(19) ఎనిమిది నెలలుగా గోపన్‌పల్లి జర్నలిస్ట్ కాలనీలోని హాస్టల్‌లో ఉంటుంది. నానక్‌రాంగూడలోని గోల్ఫ్ ఎడ్జ్(Golf Edge) అపార్ట్‌మెంట్‌లోని బేకరీలో సేల్స్ గర్ల్‌గా ఉద్యోగంలో చేరింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురంలో నివాసం ఉంటున్న సల్మాన్ ఆరు నెలల క్రితం ఇదే బేకరీలో పనికి కుదిరాడు. వారి ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ ప్రేమ గురించి బేకరీ నిర్వహకులకు తెలిసింది. దీంతో బేకరీ నిర్వాహకులు సల్మాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
'నీవు లేని లోకంలో ఉండలేను.. నీవెంటే నేను'.. ప్రియుడి మరణం తట్టుకోలేక..
Young Woman Committed Suicide Due to Her Lover Death : సల్మాన్ తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో.. తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను.. ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక అక్టోబర్ 1న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడు చనిపోయిన విషయం రెండు రోజుల తర్వాత ప్రేయసి నేహాకు తెలిసింది. దీంతో నేహా తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
Young Woman Committed Suicide in Hyderabad : మంగళవారం ఇద్దరు రూమ్‌మేట్స్(Roommates) డ్యూటీకి వెళ్లగానే గడియ పెట్టుకొని నేహా బయటకు రాలేదు. 10.30 సమయంలో ఆమె గదిని శుభ్రం చేసేందుకు హాస్టల్ సిబ్బంది వెళ్లి ఎంత పిలిచినా ఆమె స్పందించలేదు. ఈ క్రమంలో సిబ్బంది కిటికీలోంచి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. హస్టల్ నిర్వాహకులు(Hostel Managers) పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి గది తలుపులు పగులగొట్టి చూడగా.. అప్పటికే నేహా ఉరి వేసుకొని వేలాడుతూ ఉంది. ప్రియుడి ఆత్మహత్యను జీర్ణించుకోలేక తనువు చాలించిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Woman Suicide In patancheru : పక్కింటి వాళ్లు తిట్టినా.. భర్త పట్టించుకోలేదని భార్య ఆత్మహత్య