ETV Bharat / state

Cloud kitchens: క్లౌడ్‌ కిచెన్లు.. విస్తరిస్తున్న కొత్తరకం ఉపాధి - హైదరాబాద్​ తాజా వార్తలు

కొవిడ్‌ తర్వాత అన్ని రంగాలు డీలా పడినా.. త్వరగా తేరుకుంటున్నది మాత్రం హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రంగమే. ఇలాంటి రంగంలో రాణించాలనుకునే ఎందరికో అడ్డొచ్చేది ఆర్థిక సమస్యలే. వాటికి పరిష్కారాలుగా కొత్త దారుల్ని చూపిస్తున్నాయి క్లౌడ్‌ కిచెన్లు, డార్క్‌ కిచెన్లు. తక్కువ ఖర్చుతో ఉన్నచోట నుంచే గెలిచేందుకు వేదికలవుతున్నాయి. వావ్‌ మోమోస్‌, రెబెల్‌ ఫుడ్స్‌, స్లే కాఫీ, బర్గర్‌ కింగ్‌, బాక్స్‌8 లాంటి ఎన్నో ప్రముఖ ఆహార సంస్థలు అలా పుట్టినవే.

Cloud kitchens
క్లౌడ్‌ కిచెన్
author img

By

Published : Nov 10, 2021, 7:08 AM IST

ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే అంత సులువుగా అయ్యే పని కాదు. పెట్టుబడి కావాలి.. ప్రధానంగా ఒడుదొడుకులను తట్టుకునే శక్తి కావాలి. రిస్కుకు సిద్ధపడాలి. కొవిడ్​ తెచ్చిన ప్రతికూల పరిస్థితులతో ఆచితూచీ అడుగేయడం చాలా అవసరం. అందుకే రుచికరమైన పదార్థాలు, వెరైటీలతో కస్టమర్ల మనసు దోచుకునే హోటల్​ మేనేజ్​మెంట్​ ఫీల్డ్​లో ఎదిగేందుకు సలహాలు, సూచనలు మీకోసం.

ఏంటీ క్లౌడ్‌ కిచెన్‌?

హైదరాబాద్‌లాంటి చోట ఓ రెస్టారెంటు పెట్టాలంటే అయ్యే ఖర్చు కనీసం రూ.కోటిపైగానే. అదనంగా నిర్వహణ ఖర్చులు బోలెడు. ఈ భారాలేం లేకుండా ఓ చిన్న వేదిక నుంచి వంటలు చేసి ఆన్‌లైన్‌ డెలివరీలు చేసుకోవడమే క్లౌడ్‌ కిచెన్‌. అది ఇల్లో, మూతపడిన హోటలో, లేక సామూహిక వంటశాలనో.. ఏదైనా మన కల నెరవేరేందుకు వేదికే. సామూహిక వంటశాలలో రూ.5 లక్షలు, చిన్న అద్దె గదుల్లో రూ.2 లక్షలు, ఇంట్లో రూ.50 వేల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టేయొచ్చు.

.

వంటశాల వాళ్లది.. వంట మనది!

వంటశాల వాతావరణం మొత్తం ఆ సంస్థలే కల్పిస్తుండగా.. దానికి గంట, రోజుల చొప్పున రుసుము చెల్లించి వంటలు చేసుకొని వాటిని డెలివరీ చేసుకునే అవకాశమిస్తున్నాయి. హైదరాబాద్‌లో జేఎఫ్‌సీ కిచెన్‌, బుక్‌ యువర్‌ కిచెన్‌, మోక్ష్‌, ఇంకా అనేక హోటళ్లు ఈ వేదిక కల్పిస్తున్నాయి.

శ్రేయస్‌ రెడ్డి

తిందు దా.. ఓ ప్రయోగం!

హైదరాబాద్‌కు చెందిన శ్రేయస్‌ రెడ్డి ఈ విధానంపై ప్రత్యేక శిక్షణ తీసుకొని దిల్‌సుఖ్‌నగర్‌లో ‘తిందు దా’ పేరిట ఓ చిన్న అద్దె గదిలో క్లౌడ్‌ కిచెన్‌ మొదలెట్టారు. తెలంగాణ బ్రాండ్‌ వంటకాల తయారీతో ఆర్నెళ్ల కాలంలోనే విస్తృత ప్రచారం పొందిన ఈ సంస్థ ఇప్పుడు నెలకు రూ.10 లక్షల వ్యాపారం చేస్తోంది. ఏడుగురు ఉద్యోగులతో, ఫుడ్‌ డెలీవరీ సంస్థల నుంచి రోజూ వందల ఆర్డర్లు వస్తున్నాయి.

ఐదేళ్లలో 5 రెట్లు పెరగనుంది..

కొవిడ్‌ తర్వాత అనూహ్యంగా క్లౌడ్‌ కిచెన్‌ విధానం విస్తరించింది. హోటల్‌ రంగంలో ఏళ్లుగా ఉన్న నేను.. కొవిడ్‌ తర్వాత ఇందులో శిక్షణ వైపు వచ్చాను. దేశవ్యాప్తంగా 8 వేల మంది తరగతులు వింటున్నారంటే యువతలో ఆసక్తి గమనించొచ్ఛు విజయవాడ, వరంగల్‌ లాంటి నగరాలకూ ఇది విస్తరించింది. హైదరాబాద్‌ నుంచే 400 మంది ఈ ప్రయోగం చేస్తుండగా.. రానున్న ఐదేళ్లలో ఇది ఐదు రెట్లు పెరుగుతుంది.

- కిరణ్‌ బిలిగిరి, ఆహార రంగనిపుణులు

8 వంటశాలలు ఒకేచోట!

హైదరాబాద్‌లో రెండేళ్ల క్రితమే క్లౌడ్‌ కిచెన్‌ వేదిక రూపొందించారు రోహన్‌రెడ్డి అనే ఓ యువకుడు. స్విట్జర్లాండ్‌లో ఉన్నత చదువులు చదివొచ్చిన ఆయన ఇక్కడి మాదాపూర్‌లో 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘బుక్‌ యువర్‌ కిచెన్‌’ అంకురాన్ని ప్రారంభించారు. 8 వంటశాలలు ఒకేచోట ఉండి ఎందరికో వేదికైన ఈ కేంద్రం తక్కువ కాలంలో ఆదరణ పొందింది.

ఇదీ చదవండి: inter syllabus: ఇంటర్‌ సిలబస్‌పై స్పష్టత ఇవ్వని బోర్డు... అయోమయంలో విద్యార్థులు, అధ్యాపకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.