హైదరాబాద్ నగర శివారు పహాడి షరీఫ్ పరిధిలోని హార్డ్వేర్ పార్క్ వద్ద అబ్దుల్లా అనే యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్నేహితుడు సోహెల్ పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుణ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏసీపీ జయరాం సీఐని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి : చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!