కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో చేపట్టిన లాక్డౌన్ను హైదరాబాద్ నగరంలో పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. రహదారులపైకి వచ్చే వాహనదారులకు జరిమానాలు విధిస్తూ, అవసరమైతే వాహనాలు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.
నారాయణగూడ, హిమాయత్నగర్లలో అబిడ్స్ ఏసీపీ భిక్షం రెడ్డి, నారాయణగూడ సీఐ రమేష్ కుమార్ వాహనదారులకు పలు సూచనలు చేశారు. తప్పనిసరి పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావద్దని కోరారు. లేనిపక్షంలో కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు.
ఇదీ చూడండి : కరోనా కట్టడికి తన వంతు ప్రయత్నం చేస్తోన్న సర్పంచ్