హైదరాబాద్ రాజ్‌భవన్‌లోని సంక్షేమ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యోగా తరగతులను ప్రారంభించారు. రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరగతుల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు నిర్వహించిన ఆ యోగా తరగతుల్లో గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, సలహాదారు ఏపీవీఎన్ శర్మతో పాటు సుమారు 200 మంది సిబ్బంది కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ప్రతిరోజూ యోగా చేద్దాం: గవర్నర్
ప్రతి రోజు యోగా తరగతుల్లో పాల్గొనాలని గవర్నర్ కోరారు. ప్రధాని పిలుపుచ్చిన 'ఫిట్ ఇండియా' ఉద్యమానికి బలం చేకూరేలా ప్రతి రోజు అందరం యోగా చేద్దామన్నారు. రాజభవన్ స్కూల్‌లో 6 నుంచి 10వ వరకు చదువుతున్న 450 మంది విద్యార్థులకు ప్రతి శనివారం ఈ అంశంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తమిళిసై వివరించారు.
ఇదీ చదవండిః రైతులు నిశ్చింతగా ఉండొచ్చుః సీఎం కేసీఆర్