ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతల అనుచిత వ్యాఖ్యలపై నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు(ycp call statewide protests) చేపట్టనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెదేపా నేతల వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు.
మంగళవారం తెదేపా నేత పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశం(pattabhi press meet)లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు(nakka anandbabu)కు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన వాడిన భాషను వ్యతిరేకిస్తూ కొందరు దుండగులు పలు ప్రాంతాల్లో దాడి చేశారు.
ఇదీ చదవండి..