Congress meet: భాజపా టెర్రరిస్టులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, మహారాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే యశోమతి ఠాకూర్ ధ్వజమెత్తారు. దేశంలో జరుగుతున్న ఉగ్ర ఘటనలకు.. భాజపాకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఉదయ్‌పూర్ ఘటనలో నిందితుడు భాజపా కార్యకర్తగా యశోమతి ఆరోపించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మహారాష్ట్ర హత్యాకాండలో ఆ పార్టీకి సంబంధించిన వారే ఉన్నారని యశోమతి ఠాకూర్ స్పష్టం చేశారు. జమ్మూలో కూడా భాజపా మైనార్టీ నేత ఉగ్రవాద సంస్థకు చెందిన వాడేనని ఆరోపించారు. టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తూ కూడా చాలా మంది భాజపా నేతలే పట్టుబడ్డారని తెలిపారు. జమ్మూలో టెర్రరిస్టులతో సంబంధ ఉన్నవారికి భాజపా టికెట్లు ఇచ్చిందని యశోమతి ఠాకూర్ ఆరోపించారు.
రాష్ట్ర పార్జీ వ్యవహారాల బాధ్యులు మానిక్కం ఠాగూర్ అధ్యతన జరిగిన ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు అన్ని జిల్లాల డీసీసీలు, పార్టీ ఉపాధ్యక్షుడు హాజరయ్యారు. గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమ పురోగతిపై చర్చించారు. రచ్చబండ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి, మానిక్కం ఠాగూర్‌లకు ఇప్పటికే సునీల్ కనుగోలు నివేదిక అందజేశారు. సునీల్ రిపోర్టుపైనే ప్రధానంగా చర్చించారు. ఈ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన నేతలను హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఎక్కడ జరిగినా హైదరాబాద్‌లోనే లింకులు..
దేశంలో ఎక్కడ మతతత్వ అల్లర్లు జరిగిన హైదరాబాద్‌తోనే లింక్ ఉంటుందని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్ ఆరోపించారు. ఇలాంటి సంఘటనలలో కేంద్రం సమగ్రమైన విచారణ జరిపించడంలో విఫలమైందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో జరిగిన సంఘటనల్లో నిందితులకు భాజపాతో లింకులు ఉన్నాయన్నారు. లస్కరే తోయిబా లింకులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని వాటిపై చర్యలెందుకు తీసుకోవడంలేని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో భాజపా, తెరాస, ఎంఐఎం మిత్రపక్షాలుగా ఉన్నాయని.. అందుకే హైదరబాద్‌పై భాజపా పెద్దగా దృష్టి సారించడం లేదన్నారు.
ఇవీ చదవండి: భారీ వరదతో ప్రాజెక్టులకు జలకళ.. గేట్లు ఎత్తి నీటి విడుదల
ఈటల సంచలన ప్రకటన.. 'గజ్వేల్ నుంచి పోటీ.. బంగాల్ సీన్ రిపీట్..'