ETV Bharat / state

తెలంగాణలో తొలి 'ఎక్స్‌బీబీ1.5 వేరియంట్' కేసు.. డేంజరేనా?

XBB 1.5 Variant Case in Telangana: అమెరికాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ ఉపరకం ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ కేసులు కొత్తగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కొక్కటి చొప్పున వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన ఈ తరహా కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ మేరకు గురువారం ఇన్సాకాగ్‌ వెల్లడించింది.

Covid
Covid
author img

By

Published : Jan 6, 2023, 6:38 AM IST

XBB 1.5 Variant Case in Telangana : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్‌ కేసులు ఒక్కొక్కటి చొప్పున వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన ఈ తరహా కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇంతకు ముందు ఎక్స్‌బీబీ.1.5 కేసులు గుజరాత్‌లో మూడు, కర్ణాటక (1), రాజస్థాన్‌ (1) చొప్పున నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం ఇన్సాకాగ్‌ వెల్లడించింది. బీక్యూ, ఎక్స్‌బీబీ సబ్‌ వేరియంట్‌లతో పోల్చితే రోగనిరోధకతను ఏమార్చే సామర్థ్యం దీనికి ఎక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాప్తి అవకాశాలూ ఎక్కువేనని అంటున్నారు.

ఎక్స్‌బీబీ.1.5.. ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ వేరియంట్‌ రకానికి చెందినది. అమెరికాలో కొవిడ్‌ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం. అలాగే మనదేశంలో బీఎఫ్‌.7 వేరియంట్‌ కేసులూ ఏడు నమోదైనట్లు ఇన్సాకాగ్‌ నివేదిక పేర్కొంది. ఈ రకం వేరియంట్‌ కారణంగానే చైనాలో కేసులు అధికంగా నమోదవుతున్నట్లు అంచనా.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.