హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ చేతిరాత నిపుణులు మల్లికార్జున్, తెలుగు భాషాభిమాని వీవీఆర్ కిషన్ రూపొందించిన చదువరి.కామ్ వెబ్‌సైట్‌ను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఆవిష్కరించారు. ఎలాంటి లాభాలను ఆశించికుండా పలు దిన పత్రికలు సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు.
ప్రస్తుతం కరోనా కారణంగా పత్రిక ధరలు బాగా పెరిగిపోయాయని చెప్పారు. చదువరి.కామ్ ద్వారా యువ రచయితలను ప్రోత్సహించాలన్నారు. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన తొలి ఆన్‌లైన్ సీరియల్ నిశ్శబ్ద విస్ఫోటనం ప్రతి శనివారం పాఠకులకు అందిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. చదువరి.కామ్ ద్వారా వచ్చిన డబ్బులను వరద బాధితులకు అందించనట్లు మల్లికార్జున్ చెప్పారు.
ఇదీ చదవండి: ఇద్దరు మహిళా రైతుల ఆత్మహత్యాయత్నం