హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకే.. ప్రభుత్వం ఆసరా పింఛన్ 2,116 రూపాయలు చెల్లిస్తోందన్నారు. వృద్ధుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వైద్యం, రవాణాలో రాయితీ ఇవ్వాలనే డిమాండ్‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తున్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుదర్శన్ రెడ్డితోపాటు పలువురు వృద్ధులను కొప్పుల ఈశ్వర్ సన్మానించారు.
ఇదీ చూడండి: తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!