ETV Bharat / state

World Heart Day Awareness Program 2023 : 'దేశంలో 98% మందికి CPR గురించి తెలియకపోవడం బాధాకరం'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 1:58 PM IST

World Heart Day Awareness Program 2023 : "వరల్డ్‌ హార్ట్‌ డే"ను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మనం తీసుకునే ఆహారంతో పాటు జీవనశైలిలో స్వల్ప మార్పులతో హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చని వైద్యులు అన్నారు. దేశంలో ఏటా 15లక్షల మంది వరకూ గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని తెలిపారు.

World Heart Day Awareness Programmes
World Heart Day Awareness Programmes in Telangana

World Heart Day Awareness Program 2023 : ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద కార్డియాలజి సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నడక కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. దుర్గం చెరువు పార్క్‌లో ఏర్పాటు చేసిన 'బీపీ కియోస్క్‌'ను ప్రారంభించారు. అనంతరం గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు మరణాలపై మంత్రి మాట్లాడారు.

Minister Harish Rao on Heart Diseases : సడన్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఏటా దేశంలో సుమారు 15లక్షల మంది మరణిస్తున్నారని హరీశ్ రావు తెలిపారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇప్పుడు అనేక మంది గుండె వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. ఉన్నట్టుండి గుండె పనిచేయటం ఆగిపోతే వెంటనే సీపీఆర్ చేయడం ద్వారా వారిని కాపాడుకోవచ్చని చెప్పారు. అత్యంత అవసరమైన సీపీఆర్ గురించి దేశంలో 98 శాతం మందికి తెలియకపోవటం బాధాకరమని హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు.

World Heart Day 2023 : గుండెపోటు బారిన పడుతున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటున్నారని గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు అన్నారు. సరైన నిద్ర లేకపోవడం.. సిగరెట్లు, మద్యం తాగడం, సరైన ఆహారం తీసుకోనివారికి ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్​లోని అవేర్ గ్లెనేగ్గల్స్ గ్లోబల్ ఆసుపత్రి అధ్యర్యంలో "USE HEART KNOW HEART" నినాదంతో జెండా ఊపి 5కే వాక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, సాధారణ పౌరులు పాల్గొన్నారు.

Health Benefits Of Eating Early Dinner : రాత్రి త్వ‌ర‌గా డిన్నర్​ చేస్తే.. బీపీ, గుండె జబ్బులు దూరం!

"హార్ట్‌, కిడ్నీ సమస్యలకు మూలకారణం బీపీ, షుగర్. వాటిని ప్రాథమిక దశలో గుర్తించాలి. బీపీని మనం కంట్రోల్ చేయగలిగితే హార్ట్‌ సమస్యలను అరికట్టవచ్చు. ఈ మధ్య కాలంలో చిన్నవయస్సువారు కూడా హార్ట్‌ఎటాక్‌తో మరణిస్తున్నారు. వారికి ఇది వరకు బీపీ సమస్య ఉండడం వల్లనే మృతి చెందుతున్నారు. ముందే బీపీని గుర్తించి సరైన వైద్యం తీసుకుని ఉంటే అకస్మాత్తు మరణాలు అరికట్టవచ్చు." - హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

World Heart Day Celebration in Telangana : గుండె సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వరంగల్ నగరంలో వైద్యులు ర్యాలీని చేపట్టారు. కార్యక్రమంలో వైద్య విద్యార్థులు హన్మకొండ చౌరస్తాలో నిర్వహించిన ఫ్లష్‌మాబ్ అందరిని ఆకట్టుకుంది. మంచిర్యాల పట్టణంలోని చౌరస్తా నుంచి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం వరకు 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ హాజరయ్యారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని.. ప్రతిరోజు కనీసం అరగంటైనా శారీరక వ్యాయామాలు చేయాలని ఆమె సూచించారు. యుక్త వయసులోనే చాలామంది అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారని, సంపద కన్నా ఆరోగ్యం మిన్న అని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు.

"ప్రతి సంవత్సరం సెప్టెంబరు 29న వరల్డ్ హార్ట్‌ డే నిర్వహిస్తున్నాం. ప్రజలకు గుండె సంబంధిత అంశాలపైన అవగాహన కల్పించేందుకు 3కే రన్‌ నిర్వహిస్తున్నాం. ఇవాళ ఉచితంగా ఈసీజీ, 2డీఎకో, బీపీ, షుగర్ పరీక్షలు చేస్తున్నాం. వరంగల్ ప్రజలందరిని కోరేది ఒక్కటే గుండె జబ్బులపై అవగాహన తెచ్చుకుని వాటిని అరికడదాం." - డాక్టర్ అనిల్

ECG Heart Problem Indication : ఈసీజీలో తేడా ఉంటే గుండె సమస్య ఉన్నట్లేనా?

Dark Chocolate Benefits : డార్క్ చాక్లెట్స్​తో బహుళ ఆరోగ్య ప్రయోజనాలు.. బీపీ, సుగర్​లతో సహా గుండె జబ్బులకు చెక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.