వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై స్థిరాస్తి, నిర్మాణ రంగాల సంస్థలు, ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యశాల నిర్వహిస్తోంది.
రిజిస్ట్రేషన్ల విధానంపై వారికి ప్రదర్శన ఇవ్వడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఈ కార్యశాలలో మంత్రివర్గ ఉపసంఘ అధ్యక్షుడు వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అధికారులతో పాటు స్థిరాస్తి, నిర్మాణ రంగాల సంస్థల సంఘాలు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఉమ్మడి పాలమూరులో వివక్ష తగ్గింది.. చిట్టితల్లి నవ్వింది..