నేటి నుంచి మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే జనాలు దుకాణాల ఎదుట బారులుతీరారు. నగరంలోని పలు వైన్ షాప్‌ల ఎదుట పురుషులతో పాటు మహిళలూ మేము సైతం అంటూ పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు.
సికింద్రాబాద్‌లోని కొన్ని దుకాణాల ముందు మహిళలు తమకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయించాలని వైన్‌షాప్ యజమానులను డిమాండ్ చేయడం వల్ల వారికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయించారు. సికింద్రాబాద్‌తో పాటు మల్కాజిగిరి, మాదాపూర్, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో మహిళలు లైన్‌లో నిలబడి మద్యం కొనుగోలు చేయడం విశేషం.