ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 56 పంచాయతీ స్థానాలున్నాయి. వాటిలో 29 స్థానాలను మహిళలకు కేటాయించారు. వీటితో పాటు మరో నాలుగు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసి విజయం సాధించారు. నిడదవోలు మండలం కోరుమామిడి, తాడిమళ్ల గ్రామాలను ఎస్సీ జనరల్, సూరాపురం గ్రామాన్ని ఓసి జనరల్‌కు కేటాయించగా అదే కేటగిరికి చెందిన మహిళలు విజయం సాధించారు. పెరవలి మండలం తీపర్రు గ్రామాన్ని బీసీ జనరల్‌కు కేటాయించగా.. అక్కడ సైతం మహిళ అభ్యర్థే విజయ ఢంకా మోగించారు.
నిడదవోలు మండలం 23 పంచాయతీలకుగానూ... 12 పంచాయతీలు మహిళలకు కేటాయించగా 15 స్థానాల్లోనూ... పెరవలి మండలం 18 పంచాయతీలలో 9 పంచాయతీలు మహిళలకు కేటాయించగా 10 స్థానాల్లో గెలుపొందారు. ఉండ్రాజవరం మండలం 15 పంచాయతీలకు 7 పంచాయతీల్లో మహిళలు విజయం సాధించారు.
ఇదీ చదవండి: జోగులాంబ ఆలయంలో కేసీఆర్ కుటుంబం..