పెళ్లైన ఏడు నెలలకే నవ వధువు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. బంధువులు అవమానంగా మాట్లాడారంటూ ముషీరాబాద్‌కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
ఇంట్లో జరిగిన ఓ శుభకార్యం సమయంలో భర్త వినయ్‌కుమార్ అన్న ఆమెపై జోక్ వేశాడని... అందుకు తాను కూడా నవ్వడంతో మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి బీబీనగర్- ఘట్కేసర్ మధ్య ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుందని భర్త వినయ్ తెలిపాడు.
అయితే శిరీష బంధువులు మాత్రం భర్త వినయ్కుమారే ఈ హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. శిరీష బంధువుల ఈ ఘటనపై ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆగని రాక్షసత్వం: మతిలేని యువతిపై అమానవీయకాండ!