ETV Bharat / state

Women in Telangana Forest Department : అడవికి ‘ఆమె’ మహారాణి.. అటవీ విద్య, ఉద్యోగాల్లో మహిళల హవా - Girls in Forest Department Courses

Women officers in forest department : కారడవిలో ఉద్యోగం.. కర్తవ్యంతో పాటు స్వీయరక్షణా ప్రధానమే. వన్యప్రాణుల్ని కాపాడాలి. వేటగాళ్లను ఎదుర్కోవాలి. ఆక్రమణలను అరికట్టాలి. స్మగ్లర్ల నుంచి, కార్చిచ్చు నుంచి అటవీ సంపదను పరిరక్షించాలి. ఎప్పుడు ఎలాంటి ఆపద ముంచుకొస్తుందో తెలియదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఎప్పుడైనా విధి నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి. పురుషులకే సవాలు వంటి సంక్లిష్టమైన ఈ కొలువుల్లో అతివలు దూసుకుపోతున్నారు. సహనానికి ప్రతీక అయిన మహిళలు బెరుకు లేకుండా అటవీ ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు.

Women officers in forest department, ts forest department
అటవీ విద్య, ఉద్యోగాల్లో మహిళల హవా
author img

By

Published : Jan 30, 2022, 8:11 AM IST

.

Women officers in forest department : రాష్ట్రంలోని అడవుల్లో పనిచేసే ప్రతి పది మంది బీట్‌ అధికారుల్లో నలుగురికి పైగా మహిళలే ఉన్నారంటే వీరి ప్రాతినిధ్యం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. రేంజి అధికారి, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో), సీఎఫ్‌, పీసీసీఎఫ్‌తో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నత హోదాలన్నింటిలోనూ రాష్ట్ర అటవీశాఖలో మహిళా అధికారిణులే ఉన్నారు. ఉద్యోగాల్లోనే కాదు అటవీ ప్రొఫెషనల్‌ కోర్సుల్లోనూ విద్యార్థినులు పోటీపడుతూ ఆధిపత్యం సాధిస్తున్నారు.

Women in Telangana Forest Department : రాష్ట్ర అటవీరంగంలో మహిళా ఉద్యోగుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. రాష్ట్రం నుంచి అటవీ నిపుణుల సంఖ్య పెరగాలని సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో సిద్దిపేట జిల్లా అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ) అయిదేళ్ల కిందట ఏర్పాటైంది. ఇందులో బీఎస్సీ, ఎంఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులుండగా, వచ్చే ఏడాది పీహెచ్‌డీ కోర్సూ ప్రారంభం అవుతుందని డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఇంటర్​లో 98 శాతం మార్కులు, ఎంసెట్‌లో మంచి ర్యాంకుంటే గానీ ఎఫ్‌సీఆర్‌ఐలో సీటు లభించట్లేదంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇక్కడ చదివిన ఇద్దరు విద్యార్థినులు అంతర్జాతీయంగా పేరొందిన అబర్న్‌ వర్సిటీ పీజీ కోర్సులో సీట్లు సాధించడం విశేషం. మరికొందరు కూడా దేశ విదేశాల్లోని వర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసానికి ఎంపికయ్యారు.

చేరువలోనే ఎలుగుబంట్లు, పులుల్ని చూశా..

.

Telangana Forest Department : 'మ్రాబాద్‌ పులుల అభయారణ్యంలోని అచ్చంపేట, కొల్లాపూర్‌, లింగాల, అమ్రాబాద్‌ అడవుల్లో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేశా. ఎలుగుబంటి పిల్లలతో ఉన్నప్పుడు మనుషులు ఎదురుపడితే అస్సలు వదలదు. అచ్చంపేట మండలం గుమ్మలద్దిలో ఓసారి చెట్లకు అమర్చిన కెమెరాలు కనిపించకపోతే దగ్గరలోని పొదల్లో వెదకసాగాను. అక్కడే పిల్లలతో ఎలుగుబంటి కనిపించింది. దాని కంటపడకుండా తప్పించుకున్నా. తర్వాత రోజు వెతికితే విరిగిపడ్డ కెమెరా భాగాలు కనిపించాయి. వాటిని ఎలుగుబంటే ధ్వంసం చేసింది. ఒకరోజు ఉదయం బానాల అటవీప్రాంతంలో 10 మీటర్ల దూరంలోనే పెద్దపులి కనిపించింది. ధైర్యం తెచ్చుకుని మెల్లగా వెనక్కి నడుచుకుంటూ వెళ్లా. ఆ సమయంలో నా వెంట ఒక గ్రామస్తుడు మాత్రమే ఉన్నారు. తర్వాత కూడా పలుసార్లు పెద్దపులిని చూశా.'

- స్వప్న, అచ్చంపేట సెక్షన్‌ ఆఫీసర్‌

'ఇక్కడ 60 శాతానికి పైగా అమ్మాయిలే. వాతావరణ మార్పులతో పర్యావరణ పరిక్షణకు ప్రాధాన్యం పెరుగుతోంది. అటవీ, పర్యావరణ అంశాలకు సంబంధించిన ఉద్యోగావకాశాలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీగా వస్తాయి. అటవీ ఉద్యోగాల్లో మహిళలు బాగా రాణిస్తారు.'

- ప్రియాంక వర్గీస్‌, ఎఫ్‌సీఆర్‌ డీన్‌, సీఎం ఓఎస్డీ

భయం లేదు.. వన్యప్రాణుల మధ్యే ఉద్యోగం

మహిళలు బాగా రాణిస్తారు

'తొలుత హైదరాబాద్‌ జూలో.., ఇప్పుడు అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో పనిచేస్తున్నా. వన్యప్రాణుల ఆహారం, వాటి ఆరోగ్య స్థితిగతుల్ని అధ్యయనం చేస్తుంటా. చిరుతలు, ఎలుగుబంట్లు కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు శబ్దం చేయకుండా పక్కకు తప్పుకోవాలి.'

- శ్వేత, ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌

దేశంలో అడవులన్నీ అధ్యయనం చేశా

.

Girls in Forest Department Courses : 'అటవీ ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరే అమ్మాయిలు పెరుగుతున్నారు. నేను హైదరాబాద్‌లో చదివినప్పుడు కోర్సులో భాగంగా దేశంలో రకరకాల అడవులకు తీసుకెళ్లారు. ఫీజు మినహాయింపుతో పాటు స్కాలర్‌షిప్‌తో అమెరికాలోని అబర్న్‌ వర్సిటీలో పీజీ కోర్సులో ప్రవేశం లభించింది. ఇప్పుడు రెండో సంవత్సరం చదువుతున్నా. వన్యప్రాణి విద్యకు, పరిశోధనకు డిమాండ్‌ పెరుగుతోంది. ఉద్యోగ అవకాశాలూ బాగున్నాయి.'

- సూర్యదీపిక, అబర్న్‌ వర్సిటీ, అమెరికా

40 శాతం వరకు ఉద్యోగినులే

Women in Rescue of Forest : 'మహిళలు రిజర్వేషన్లలోనే కాదు ఓపెన్‌ కాంపిటీషన్‌లోనూ అటవీ ఉద్యోగాలు సాధిస్తున్నారు. బీట్‌ అధికారుల్లో 40 శాతం మంది బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ చదివిన వాళ్లు. కొందరు అప్పటికే ఉన్న ఉద్యోగాల్ని సైతం వదులుకుని అటవీశాఖలో చేరారు. ఎఫ్‌సీఆర్‌ఐ విద్యార్థినులు జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల్లో పోటీపడి ప్రవేశాలు పొందుతున్నారు.'

- ఆర్‌.శోభ, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి

అడవుల్లోకి ఒక్కసారి వెళ్లాలంటేనే భయపడుతుంటాం. అలాంటిది పూర్తిగా అడవులతోనే ముడిపడి ఉండే ఉద్యోగాల్లో చేరేందుకు, అటవీ విద్యను అభ్యసించేందుకు తల్లిదండ్రులు తమ కుమార్తెలను ప్రోత్సహిస్తుండడం విశేషం. సాధారణ డిగ్రీ, పీజీతోపాటు బీటెక్‌, ఎంటెక్‌ చేసిన అమ్మాయిలూ అటవీ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. ఈ శాఖలో ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉండటంతో బీఎస్సీ, ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది.

.
.

ఇదీ చదవండి: Land Values in TS: బంజారాహిల్స్​లోనే గరిష్ఠం.. చదరపు గజం రూ.1.14 లక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.