Women False Rape Accusations Hyderabad : కొందరు మహిళలు చేసేపని మహిళా లోకానికే అపకీర్తి తెచ్చిపెడుతోంది. హైదరాబాద్‌కు చెందిన పరమానంద జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్‌వైపు కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ మహిళ లిఫ్ట్ ఇవ్వాలని కోరగా ఎక్కించుకుని ముందుకెళ్లాడు. కొద్దిదూరం వెళ్లగానే ఆ మహిళ తనవస్త్రాలను తానే చించుకొని డబ్బులు ఇవ్వాలని పరమానందని డిమాండ్ చేసింది.
Kiladi Lady Hyderabad : పలు సెక్షన్లు ప్రస్తావిస్తూ న్యాయవాదినని బెదిరించడంతో పాటు డబ్బు ఇవ్వకుంటే అత్యాచారం కేసు పెడతానంటూ హెచ్చరించింది. ఖంగుతిన్న బాధితుడు వెంటనే ఆమెను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాడు. విచారించిన పోలీసులు ఆ మహిళ గతంలో ఈతరహా మోసాలకి పాల్పడినట్లు గుర్తించారు. డబ్బులు వసూళ్లే లక్ష్యంగా పెట్టుకున్న ఆ మహిళపై గతంలో పలు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గతంలో ఆ మహిళ చేతిలో పలువురు అమాయకులు బలయ్యారని పోలీసులు తెలిపారు.
లేడీసే కదా అని లిఫ్ట్ ఇస్తున్నారా - ఇలాంటోళ్లు కూడా ఉంటారు, జర పైలం
Women Blackmailing Drivers By Asking Lift : ఇటీవలే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలాంటి ఘటనే జరిగింది. బేగంపేటకు చెందిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ మహిళ బంజారాహిల్స్ ఎస్ఎన్టి సిగ్నల్ వద్ద లిఫ్ట్ అడిగింది. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి బాధితుడు 20 వేలు చెల్లించుకోవాల్సి వచ్చింది.
ముగ్ధ సిగ్నల్ వద్దకు చేరుకోగానే వాహనం దిగిన మహిళ తాళం చెవి లాక్కొని డబ్బులు డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకుంటే వస్త్రాలు విప్పి అల్లరి చేస్తానని బెదిరించడంతో గత్యంతరం లేక బాధితుడు డబ్బు చెల్లించాడు. ఆ ఘటన జరిగిన తర్వాత బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఆమహిళ ఆన్‌లైన్ గేమింగ్‌లో డబ్బులు పోగొట్టుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
మాయలేడీ లీలలు.. రూ.లక్షలు కోల్పోయిన బాధితులు
Cheating Lady Arrest in Hyderabad : పంజాగుట్టలో పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ బైక్‌పై ఎక్కిన మహిళ అతని మెడలో గొలుసు దొంగిలించి పరారైంది. ఈ తరహా కిలాడీ లేడీలు కొత్తతరహా నేరాలకు తెరతీస్తున్నారు. కొందరు మహిళల వికృతచేష్టలతో నిజంగా సాయం అవసరమైన సమయాల్లో ఎవరూ సాయం చేసేందుకు ముందుకురాని పరిస్థితి నెలకొంటోంది. వింతచేష్టలతో బాధితుల జేబు గుళ్ల చేస్తున్న కిలాడీ లేడీలకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలు కోరుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు