మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీ లీల అన్నారు. కృషి, పట్టుదల, సాధించాలనే ఉత్సహాం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో స్థిరపడిన అనిక, దీపిక అనే ఇద్దరు మహిళా పారిశ్రామికవేత్తలు తోటి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఉమెన్ బిజినెస్ కల్ట్ అనే సంస్థను ఆమె శుక్రవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి పలువురు మహిళా పారిశ్రామికవేత్తలను ఆమె సత్కరించారు. మహిళలను ప్రోత్సహించి వారు వ్యాపార రంగంలో రాణించేందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు వారికి ఆర్థికంగా సహాయం అందించేందుకు ఒక వేదిక ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని శ్రీలీల అన్నారు. గతంలో వ్యాపారం రంగంలో కేవలం పురుషులు మాత్రమే ఉండే వారిని ఇప్పుడు మహిళలు కూడా ఈ రంగంలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం...