నేల నుంచి నింగి వరకు అన్నీ తామై దూసుకెళ్తోన్న అతివలు... బైక్ రైడింగ్‌లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా రహదారులపై రయ్ రయ్‌మంటూ పరుగులు తీస్తున్నారు. నిండైన ఆత్మవిశ్వాసంతో బండెక్కి జోరు చూపిస్తున్నారు. వాయువేగంతో సరిహద్దులను దాటుకుంటూ లోకాన్ని చుట్టేస్తున్నారు. చిన్నతనంలో సరదాగా నేర్చుకున్న ద్విచక్రవాహనం... పెరిగి పెద్దాయ్యాక కూడా ఆ అభిరుచిని కొనసాగిస్తున్నారు.
కొందరు సరదా కోసం బైక్ రైడింగ్ చేస్తే... మరికొందరు అవసరాల రీత్యా బండి బయటకు తీస్తున్నారు. రద్దీగా ఉండే ట్రాఫిక్‌లోనూ అవలీలగా అతివలు దూసుకెళ్తూ అవతలివారిని అవాక్కయ్యేలా చేస్తున్నారు. అలాంటి కొంతమంది యువతులను ఈటీవీ భారత్ పలకరించింది. బైక్ రాణుల అనుభవాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం..
ఇదీ చదవండి: ఈ నీళ్లు తాగితే కరోనా దరిచేరదట...!