ETV Bharat / state

శంషాబాద్‌ విమానాశ్రయంలో మహిళల భద్రత కోసం ఉమెన్‌ డెస్క్‌లు - శంషాబాద్‌ విమానాశ్రయం తాజా వార్తలు

విశ్వ నగరంగా అభివృద్ది చెందుతున్న హైద్రాబాద్​కు కొవిడ్ దృష్ట్యా వివిధ రాష్ట్రాల, దేశాల నుంచి రాకపోకలు తగ్గినా.. సడలింపులతో శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణికులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యాపార కార్యాలకలాపాలను చూసుకునేందుకు నగరానికి వస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహిళల భద్రతపై సైబరాబాద్ పోలీసుల ప్రత్యేక దృష్టి పెట్టారు. విమానాశ్రయ ప్రవేశ ద్వారాల వద్ద ఉమెన్ డెస్క్​ను ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు ఉన్న ఫిర్యాదులు చేయమని సూచిస్తున్నారు.

శంషాబాద్‌ విమానాశ్రయంలో మహిళల భద్రత కోసం ఉమెన్‌ డెస్క్‌లు

author img

By

Published : Nov 10, 2020, 7:08 AM IST

శంషాబాద్‌ విమానాశ్రయంలో మహిళల భద్రత కోసం ఉమెన్‌ డెస్క్‌లు

మహిళ భద్రతకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే షీ టీంను ఏర్పాటు చేసి మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టిన పోలీసులు వాటికి పూర్తిగా రూపుమాపేందుకు నడుంబిగించారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సాంకేతికత సాయంతో పిర్యాదు చేసే విధంగా ఇప్పటికే ముబైల్ యాప్స్, వాట్సప్ నంబర్​లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రయాణ ప్రాంగణాల్లో వేధింపులు ఎక్కువ అవడం వల్ల ఆయా ప్రాంతాలపై దృష్టి సారించి ప్రత్యేక బృందాలను గస్తీ ఉంచుతున్నారు.

తాజాగా లాక్ డౌన్ సడలింపుల కారణంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికులు తాకిడి పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించేదుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక ఉమెన్ డెస్క్​ను ఏర్పాటు చేశారు. ఇద్దరు శిక్షణ పొందిన మహిళా కానిస్టేబుళ్లను అందుబాటులో ఉంచారు. అంతే కాకుండా విమానాశ్రయం నుంచి మహిళలు తమ గమ్య స్థానాలకు క్యాబ్​ల పైనే ఆధారాపడుతుంటారు.

గతంలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. విమానాశ్రయానికి వచ్చి వెళ్లే క్యాబ్​లపై దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. గతంలో క్యాబ్​లో ఎక్కిన తర్వాత క్యాబ్ డ్రైవర్లు మహిళలను బెదిరించి వారి వద్ద ఉన్న వస్తువులను, డబ్బులను కాజేసిన ఘటనలు పునారావృతం కాకుండా విమానశ్రయంలో డయల్ 100 పై అవగాహణ వచ్చేలా హోర్డింగ్​లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని పోలీసులు భరోసా కల్పిస్తున్నారు.

మహిళలను వేధించినా... వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించినా ఉమెన్ డెస్క్‌లో ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకోనున్నారు. విమానాశ్రయ సిబ్బంది సమన్వయంతో నిందితులను పట్టుకునేలా ఏర్పాటు చేశారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు న్నా ఉమెన్ డెస్క్‌లో ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ సజ్జనార్ తెలిపారు. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఉమెన్‌ డెస్క్‌లో అవసరమైన మార్పులు చేయాలని పోలీసుశాఖ భావిస్తోంది

ఇదీ చదవండి: శంషాబాద్​ విమానాశ్రయంలో విమెన్​ డెస్క్​ని ప్రారంభించిన సీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.