ETV Bharat / state

మోదీ జన్మదినం పురస్కరించుకుని.. హైదరాబాద్​కు చేరుకున్న రథయాత్ర - Mahila Rath Yatra on the occasion of Modi's birthday

మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఓ మహిళ రథయాత్ర చేపట్టింది. ఈ రథయాత్ర ఈ రోజు హైదరాబాద్​కు చేరుకుంది. ఈ సందర్భంగా... గౌలిగూడ రామమందిర్​లో విశ్వహిందూ పరిషత్ , భజరంగ్ దళ్ ప్రతినిధులు రాజ్యలక్ష్మి మందాకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Woman Rath Yatra reaches Hyderabad
మోదీ జన్మదినం పురస్కరించుకుని.. హైదరాబాద్​కు చేరుకున్న రథయాత్ర
author img

By

Published : Sep 26, 2020, 11:06 PM IST

దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని... ఓ మహిళ రథయాత్ర చేపట్టింది. తమిళనాడుకు చెందిన రాజ్యలక్ష్మి మందా తాను స్వతహాగా తయారు చేయించిన 613 కిలోల భారీ గంటతో రామేశ్వరం నుంచి అయోధ్య రామజన్మభూమి వరకు రథయాత్రకు శ్రీకారం చుట్టింది.

10 రాష్ట్రాల మీదుగా 21రోజుల్లో 4,552కిలోమీటర్లు తానే డీసీఎంను డ్రైవ్ చేసుకుంటూ తన గమ్యస్థానానికి చేరుకొనుంది. లీగల్ రైట్స్ ఇండియా ఆధ్వర్యంలో... రాజ్యలక్ష్మి మందా చేపట్టిన రథయాత్ర ఈ రోజు హైదరాబాద్​కు చేరుకుంది.

ఈ సందర్భంగా... గౌలిగూడ రామమందిర్​లో విశ్వహిందూ పరిషత్ , భజరంగ్ దళ్ ప్రతినిధులు రాజ్యలక్ష్మి మందాకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే నెల 7న రథయాత్ర అయోధ్య చేరుకొని... నూతనంగా నిర్మిస్తున్నా రామమందిర్ నిర్వాహకులకు గంటను అందజేయనున్నట్లు రాజ్యలక్ష్మి మందా తెలిపారు.

ఇదీ చూడండి: సర్కారు ఖజానా నింపుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌: అఖిలపక్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.