ETV Bharat / state

నిస్సహాయ స్థితిలో ఆపసోపాలు.. ఆహరం అందించిన మహిళ - patient at helpless situation in nims hospital

చెట్టుకింద కూర్చున్న ఓ రోగి.. చేతిలో రోగికి పైపు ద్వారా ఆహారం అందించే పైపుతో ఓ మహిళ. సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వైరల్‌ అయిన ఈ చిత్రం నిమ్స్‌ ఆసుపత్రి ఆవరణ లోనిది.

patient at nims hyderabad
నిస్సహాయ స్థితిలో ఆపసోపాలు.. ఆహరం అందించిన మహిళ
author img

By

Published : Oct 5, 2020, 8:07 AM IST

తీవ్ర అనారోగ్యం, ప్రైవేటు ఆసుపత్రుల వారు అడిగినంత చెల్లించే స్థోమత లేని పేదరికం.. ఖమ్మం నుంచి చికిత్స కోసం శనివారం హైదరాబాద్​ నిమ్స్‌కు చేరుకున్నాడు ఓ బాధితుడు. పూర్తిగా పరిశీలించకుండానే అత్యవసర విభాగంలో చికిత్స అవసరం లేదని వైద్యులు తిప్పి పంపారు.

నిస్సహాయ స్థితిలో ఆసుపత్రి ఆవరణలోనే ఓ చెట్టు కింద కూర్చుని ఆహారం తీసుకునేందుకు ఆపసోపాలు పడుతుండగా ఓ నెటిజన్‌ దీన్ని ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వైద్యుల నిర్లక్ష్యంపై నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై స్పందించిన ఆసుపత్రి వర్గాలు బాధితుడి పరిస్థితి తీవ్రంగా లేకపోవడంతోనే సాధారణ ఓపీలో చూపించుకోవాలని పంపించామని చెబుతున్నారు.

ఇదీ చదవండిః కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. వేధిస్తున్న సాధారణ సమస్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.